Upcoming SUVs : రోడ్లపై ఎస్‌యూవీల హంగామా.. వచ్చే 18 నెలల్లో లాంచ్ కానున్న టాప్-5 మోడల్స్ ఇవే.

Upcoming SUVs : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో రాబోయే 12 నుంచి 18 నెలలు అత్యంత కీలకం కానున్నాయి. ముఖ్యంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పెను మార్పులు రాబోతున్నాయి. ఒకప్పుడు సెడాన్ కార్లకు ఉన్న క్రేజ్ ఇప్పుడు ఎస్‌యూవీల వైపు మళ్లింది. దీనిని గమనించిన ప్రముఖ కంపెనీలైన రెనాల్ట్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, మారుతి సుజుకి తమ సరికొత్త మోడళ్లను, అప్‌డేటెడ్ వెర్షన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యాయి. అత్యాధునిక ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రాబోతున్న ఆ టాప్-5 కార్ల వివరాలు తెలుసుకుందాం.
1. రెనాల్ట్ మినీ డస్టర్
రెనాల్ట్ కంపెనీ తన ఐకానిక్ మోడల్ డస్టర్‌ను సరికొత్త రూపంలో మినీ డస్టర్‌గా తీసుకురాబోతోంది. ఇది చూడటానికి చాలా రగ్డ్, మస్కులర్ లుక్‌తో ఉండబోతోంది. కిగర్ కంటే ఇది కొంచెం పవర్‌ఫుల్ అనిపించేలా ఎత్తైన బోనెట్, వెడల్పాటి వీల్ ఆర్చ్‌లతో రానుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నాటికి ఇది మన దేశ రోడ్లపై పరుగులు తీసే ఛాన్స్ ఉంది.
2. ఫోక్స్‌వ్యాగన్ కొత్త ఎస్‌యూవీ
జర్మన్ టెక్నాలజీతో ఫోక్స్‌వ్యాగన్ కూడా కాంపాక్ట్ సెగ్మెంట్‌లో సత్తా చాటాలనుకుంటోంది. ఇది 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రాబోతోంది. ఇది దాదాపు 114bhp పవర్, 178Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చూడటానికి స్కోడా కైలాక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, దీని డిజైన్, స్టైలింగ్ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటుంది. 2027 మధ్య నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
3. మహీంద్రా థార్ ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా థార్ ప్రియులకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్. త్రీ-డోర్ థార్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాదే లాంచ్ కానుంది. ఇటీవల టెస్టింగ్‌లో కనిపించిన మోడల్ ప్రకారం.. ఇందులో ఇంటీరియర్ పరంగా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఇంజిన్ ఆప్షన్లు పాతవి ఉన్నప్పటికీ, కేబిన్ లోపల మరిన్ని స్మార్ట్ ఫీచర్లు, కొత్త టెక్నాలజీని మహీంద్రా జోడించబోతోంది.
4. మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి సుజుకి తన హిట్ మోడల్ ఫ్రాంక్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇప్పుడు ఇండియాలో కూడా ప్రవేశపెట్టబోతోంది. అంతేకాకుండా, ఇది మారుతి నుంచి వచ్చే మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.
5. మారుతి సుజుకి బ్రెజ్జా
బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కూడా త్వరలోనే కొత్త హంగులతో రాబోతోంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు కొత్తగా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎన్‌జీ మోడల్‌లో గ్యాస్ సిలిండర్‌ను ఫ్లోర్ కింద అమర్చి, బూట్ స్పేస్ పెంచేలా డిజైన్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ సామాను తీసుకెళ్లడం సాధ్యమవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
