Upcoming Diesel SUVs : డీజిల్ ఎస్‌యూవీ ప్రియులకు పండగే.. 2026 లో రాబోతున్న టాప్-5 పవర్‌ఫుల్ కార్లు ఇవే.

Upcoming Diesel SUVs : డీజిల్ ఎస్‌యూవీ ప్రియులకు పండగే.. 2026 లో రాబోతున్న టాప్-5 పవర్‌ఫుల్ కార్లు ఇవే.
X

Upcoming Diesel SUVs : భారత ఆటోమొబైల్ రంగంలో పెట్రోల్ కార్ల హవా కొంచెం తగ్గుముఖం పట్టినా, డీజిల్ ఎస్‌యూవీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్ చేసే వారికి, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇప్పటికీ డీజిల్ ఇంజిన్లే మొదటి ప్రాధాన్యత. 2026 నాటికి భారత మార్కెట్లో సంచలనం సృష్టించబోతున్న టాప్-5 డీజిల్ ఎస్‌యూవీల వివరాలు చూద్దాం.

గత ఏడాది గణాంకాలు చూస్తే.. పెట్రోల్ కార్ల వాటా తగ్గినప్పటికీ డీజిల్ కార్ల వాటా సుమారు 18.33 శాతంగా ఉంది. ముఖ్యంగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో డీజిల్ ఇంజిన్లకు గిరాకీ విపరీతంగా ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడం, పవర్‌ఫుల్ టార్క్,ఆఫ్-రోడింగ్‌కు అనుకూలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందుకే దిగ్గజ కంపెనీలు తమ పాత మోడళ్లను అప్‌డేట్ చేయడంతో పాటు సరికొత్త డీజిల్ వాహనాలను రంగంలోకి దించుతున్నాయి.

1. ఎంజీ మెజెస్టర్

వచ్చే ఏప్రిల్ 20, 2026న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఎంజీ మెజెస్టర్, టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 213 హెచ్‌పి పవర్, 479 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారు లగ్జరీ, పవర్ కలయికగా ఉండబోతోంది.

2. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా తన ఐకానిక్ స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ మోడళ్లను కొత్త హంగులతో సిద్ధం చేస్తోంది. డిజైన్‌లో చిన్నపాటి మార్పులు, మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు రాబోతున్నాయి. వీటిలో ప్రస్తుతం ఉన్న నమ్మకమైన 2.2 లీటర్ ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్‌నే కొనసాగించనున్నారు. దేశీయ రోడ్లపై ఈ కారు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

3. కియా సెల్టోస్ కొత్త డీజిల్ వేరియంట్లు

కియా ఇండియా 2026 మధ్యలో సెల్టోస్ టాప్-ఎండ్ వేరియంట్లు GTX+, X-Line (O)లో కొత్త ఫీచర్లను తీసుకురానుంది. గ్రీన్ బ్రేక్ కాలిపర్స్, లెవల్ 2 ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లు దీని సొంతం. డీజిల్ సెగ్మెంట్‌లో స్టైలిష్ కార్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

4. మహీంద్రా థార్ రాక్స్ 1.5 డీజిల్:

ప్రస్తుతం థార్ రాక్స్ 2.2 లీటర్ ఇంజిన్‌తో వస్తోంది. అయితే సామాన్యులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు మహీంద్రా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్‌ను 2026లో లాంచ్ చేయనుంది. ఇది బేస్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. తక్కువ ధరలో థార్ రాక్స్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది శుభవార్త.

5. కొత్త జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్:

ఎస్‌యూవీల రారాజు టయోటా ఫార్చ్యూనర్ తన నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను 2026 చివరి నాటికి గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఆ వెంటనే భారత్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. మరింత ప్రీమియం ఇంటీరియర్, సరికొత్త స్టైలింగ్, పవర్ఫుల్ 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఇది రాబోతోంది. ఫార్చ్యూనర్ ప్రియులు ఈ అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story