UPI AutoPay: ఇకపై కరెంట్ బిల్లు, ఈఎంఐ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ల చింత అక్కర్లేదు!

UPI AutoPay: ఇకపై కరెంట్ బిల్లు కట్టడం మర్చిపోవడం లేదా ప్రతి నెలా SIP కోసం రిమైండర్ పెట్టుకోవడం వంటి అవసరం లేదు. యూపీఐ ఆటోపే అన్నింటినీ ఆటోమేటిక్‌గా చేస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ సౌకర్యం ఇప్పుడు ప్రజలకు ఫస్ట్ ఆప్షన్ గా మారుతోంది. ఇది వేగంగా, పూర్తిగా పారదర్శకంగా ఉండటంతో కోట్లాది మంది వినియోగదారులు దీనిని బ్యాంకులు, యాప్‌ల ద్వారా ఉపయోగిస్తున్నారు.
యూపీఐ ఆటోపే ద్వారా మీరు మీ యూపీఐ యాప్ నుండి నేరుగా రికరింగ్ పేమెంట్స్‌ను సెట్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ఓటీటీ సేవలు, బీమా ప్రీమియంలు, ఈఎంఐలు, లేదా మ్యూచువల్ ఫండ్ సిప్ల వంటి వాటికి కేవలం ఒకసారి చెల్లింపు అనుమతి ఇస్తే చాలు. నిర్ణీత తేదీన మొత్తం మీ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. మీరు పేమెంట్స్‌ను రోజువారీ, వారానికోసారి, నెలవారీ లేదా సంవత్సరానికోసారి సెట్ చేసుకోవచ్చు. ప్రతి డెబిట్ ముందు మీకు ఒక రిమైండర్ కూడా వస్తుంది. తద్వారా మీకు పూర్తి కంట్రోల్ ఉంటుంది.
యూపీఐ ఆటోపే స్పెషాలిటీ ఏంటంటే.. ఇది కంఫర్ట్, కంట్రోల్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా మీ యూపీఐ యాప్ నుండి ఈ ఆటోమేటిక్ ఆప్షన్ మార్చవచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్ యూపీఐ సురక్షితమైన వాతావరణంలో జరుగుతుంది, కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం. మీకు అనేక బిల్లులు వేర్వేరు తేదీలలో వస్తే వాటిని నిర్వహించడం కష్టమవుతుంది. యూపీఐ ఆటోపే మీ తరపున అన్ని చెల్లింపులను సమయానికి చేస్తుంది, తద్వారా లేట్ ఫీజులు లేదా సర్వీసులను నిలిపివేయబడే ఇబ్బందులు ఉండవు. దీనివల్ల మీరు మీ నెలవారీ ఖర్చులను మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా బ్యాంకులు యూపీఐ యాప్‌లు తమ హోమ్‌పేజీలో ఆటోపే ఆప్షన్‌ను అందిస్తున్నాయి. తద్వారా మీరు అన్ని పేమెంట్స్ ఒకే చోట చూసుకోవచ్చు. ట్రాక్ చేయవచ్చు.
యూపీఐ ఆటోపేమెంట్ కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, భారతదేశం డిజిటల్ రంగంలో ఒక పెద్ద ముందడుగు. అది జిమ్ మెంబర్షిప్ అయినా, క్రెడిట్ కార్డ్ బిల్లు అయినా లేదా SIP ఇన్వెస్ట్మెంట్ అయినా ఆటోపే ద్వారా సమయానికి పేమెంట్స్ చేసుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

