VinFast : టాటా నెక్సాన్, ఎంజీ కార్లకు సవాల్.. విన్‌ఫాస్ట్ 7-సీటర్ ఎస్‌యూవీ టెస్టింగ్ షురూ.

VinFast : ఎంజీ, టాటా నెక్సాన్ వంటి ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పోటీని పెంచేందుకు మరో కొత్త కంపెనీ సిద్ధమవుతోంది. ఆ కంపెనీ పేరు విన్‌ఫాస్ట్. ఈ వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ భారత్‌లోకి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావాలని చూస్తోంది. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ అని పిలవబడే ఈ ఎస్‌యూవీ టెస్టింగ్ మన దేశ రోడ్లపై మొదలైంది. లాంచ్ అయ్యే ఛాన్స్ ఉన్న ఈ కారు ఫీచర్లు, రేంజ్ వివరాలు తెలుసుకుందాం.
వియత్నామీస్ కంపెనీ అయిన విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌లో సెప్టెంబర్ 2025 నాటికి VF6, VF7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో అడుగుపెట్టనుంది. డిసెంబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా 35 డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ అనే 7-సీటర్ ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కారు కోసం ఈ ఏడాది ప్రారంభంలో డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది. ఇప్పుడు అదే మోడల్ భారతీయ రోడ్లపై టెస్టింగ్ మొదలుపెట్టింది.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ అనేది ఒక 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ. ఇది మార్కెట్లో కియా కారెన్స్ క్లావిస్ EV, BYD eMAX 7, త్వరలో రాబోయే మహీంద్రా XEV 9S వంటి మోడల్స్‌కు గట్టి పోటీనిస్తుంది. ప్రపంచ మార్కెట్లో లిమో గ్రీన్ 60.13 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 204 బీహెచ్‌పీ శక్తిని, 280 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 450 కి.మీ వరకు రేంజ్ ఇవ్వగలదు.ఈ కారు ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉంటాయి.
లిమో గ్రీన్ ఒక పెద్ద ఫ్యామిలీ కారు. దీని పొడవు 4,740 మి.మీ, వెడల్పు 1,872 మి.మీ, వీల్‌బేస్ 2,840 మి.మీ గా ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మి.మీ. ఇందులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చబడి ఉన్నాయి.ఈ కారు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీని 10% నుంచి 70% వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది.ఇది లిమో రెడ్, సిల్వర్, బ్లాక్, ఎల్లో రంగుల్లో లభిస్తుంది.
టెక్నాలజీ, కంఫర్ట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కారులో ఈ కింది ఫీచర్లను అందిస్తున్నారు. డీఆర్‌ఎల్ ఎల్‌ఈడీ స్ట్రిప్స్‌తో కూడిన సిగ్నేచర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో), డీ-కట్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-జోన్ ఏసీ, క్లైమేట్ కంట్రోల్, ప్రయాణీకుల కోసంఎయిర్ ఫిల్టరింగ్ సిస్టమ్, వెనుక ప్రయాణీకుల కోసం యూఎస్‌బీ పోర్ట్‌లు (కనెక్టివిటీ, ఛార్జింగ్ కోసం), ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్, కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

