Car Discounts : కార్ల పండగంటే ఇదే.. ఏకంగా 1.5 లక్షలు ఫోక్స్‌వ్యాగన్ ఇస్తున్న ఈ ఆఫర్లు చూస్తే షాకవ్వాల్సిందే.

Car Discounts : కొత్త ఏడాది వస్తుందంటే చాలు కార్ల కంపెనీలు పాత స్టాక్ క్లియర్ చేయడానికి పోటీపడి ఆఫర్లు ఇస్తుంటాయి. ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ కూడా ఈ డిసెంబర్‌లో అదే బాటలో పయనిస్తోంది. ఫాస్ట్‌ఫెస్ట్ పేరుతో సరికొత్త సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఆ కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ అయిన టైగన్, వర్టస్ కార్లపై ఏకంగా రూ.1.55 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వేళ కారు కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశమని చెప్పాలి.
ఈ సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే.. మీరు కారు కొంటే మొదటి 6 నెలల ఈఎంఐ మొత్తాన్ని కంపెనీయే భరిస్తుంది. టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్, వర్టస్ టాప్‌లైన్ వంటి వేరియంట్లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో పాటు పాత కారును మార్చుకోవాలనుకునే వారికి రూ.30,000 నుంచి రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. మీరు ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి. కొన్ని వేరియంట్లపై నేరుగా రూ.లక్ష వరకు నగదు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మోడల్ వారీగా చూస్తే.. వర్టస్ టాప్‌లైన్ 1.0L వేరియంట్‌పై గరిష్టంగా రూ.1.55 లక్షల బెనిఫిట్స్ అందుతున్నాయి. అలాగే టైగన్ హైలైన్ ప్లస్ ఆటోమేటిక్ వెర్షన్‌పై రూ.లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మీ ప్రాంతంలోని డీలర్‌షిప్‌ను బట్టి ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అందుకే కారు బుక్ చేసుకునే ముందు దగ్గర్లోని షోరూమ్‌కు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

