Volkswagen : రూ. 1.04 లక్షలు తక్కువకే లగ్జరీ ఎస్‌యూవీ.. ఫోక్స్‌వ్యాగన్ బంపర్ ఆఫర్.

Volkswagen :కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే ఛాన్స్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ తన పాపులర్ ఎస్‌యూవీ టైగన్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. జనవరి 2026 నెలలో ఈ కారుపై ఏకంగా రూ. 1.04 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఒకవైపు కొత్త ఏడాదితో కార్ల ధరలు పెరుగుతుంటే, వోక్స్‌వ్యాగన్ మాత్రం కస్టమర్లను ఆకర్షించడానికి ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది.
టైగన్ మోడల్స్‌లో బేస్ వేరియంట్ అయిన కమ్ ఫర్ట్ లైన్ MT పై అత్యధికంగా రూ. 1.04 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. కేవలం ఎంట్రీ లెవల్ మాత్రమే కాదు, హైలైన్ ప్లస్ AT వేరియంట్‌పై కూడా దాదాపు రూ. లక్ష వరకు రాయితీ ఉంది. స్పోర్టీ లుక్‌ను ఇష్టపడే వారి కోసం GT లైన్ AT మోడల్‌పై రూ. 80,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం టైగన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.42 లక్షల నుంచి రూ. 19.19 లక్షల మధ్యలో ఉంది. అయితే ఈ నెలలో ఆఫర్ల ద్వారా వీటిని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కేవలం లుక్ పరంగానే కాదు, పర్ఫార్మెన్స్ పరంగానూ అదిరిపోతుంది. ఇందులో 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా 1.5 లీటర్ ఇంజిన్ ఇప్పుడు కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తోనే అందుబాటులో ఉంది. సేఫ్టీ విషయానికి వస్తే, గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. అంటే, భారతీయ రోడ్లపై ప్రయాణించే అత్యంత సురక్షితమైన కార్లలో టైగన్ ఒకటి. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో స్టాండర్డ్ గా వస్తాయి.
టైగన్ కారు లోపల ప్రీమియం ఫీల్ ఇచ్చేలా బ్లాక్ సీట్లు, రెడ్ స్టిచింగ్ ఉంటాయి. బయట భాగంలో రెడ్ GT బ్యాడ్జ్, ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ కారుకు ఒక స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. 10 ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి మోడ్రన్ ఫీచర్లు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్‌లో దీనికి హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్ల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ ఇమేజ్, ఇప్పుడు ఇస్తున్న డిస్కౌంట్ టైగన్‌ను బెస్ట్ ఛాయిస్‌గా మారుస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

