Volkswagen Tayron R-Line : కారు కాదు ఇది కదిలే ఇల్లు..రూ.51 వేలకే బుకింగ్..అదిరిపోయే ఫీచర్లు.

Volkswagen Tayron R-Line : కారు కాదు ఇది కదిలే ఇల్లు..రూ.51 వేలకే బుకింగ్..అదిరిపోయే ఫీచర్లు.
X

Volkswagen Tayron R-Line : ఫ్యామిలీతో కలిసి రాజసంగా ప్రయాణించాలనుకునే వారి కోసం జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ఒక అద్భుతమైన వార్త మోసుకొచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టైరాన్ ఆర్-లైన్ 7-సీటర్ ఎస్‌యూవీని ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫిబ్రవరి 19, 2026న గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ కారు, ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఫ్లాగ్‌షిప్ మోడల్. దీని ప్రారంభ ధర రూ.46.99 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. మీరు కూడా ఈ లగ్జరీ కారును సొంతం చేసుకోవాలనుకుంటే కేవలం రూ.51,000 టోకెన్ అమౌంట్‌తో ఆన్‌లైన్‌లో లేదా షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు.

ఈ కారు కేవలం చూడటానికే కాదు, పనితీరులో కూడా కింగ్ అనిపించుకుంటోంది. ఇందులో పవర్ఫుల్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 204 పీఎస్ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి తోడు 7-స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4 మోషన్ (4MOTION) ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉండటం వల్ల, ఎటువంటి రోడ్ల మీదైనా ఈ కారు దూసుకుపోతుంది. కేవలం 7.3 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత.

డిజైన్ పరంగాటైరాన్ ఆర్-లైన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో వెలిగే ఫోక్స్‌వ్యాగన్ లోగో, ఐక్యూ లైట్ హెచ్‌డీ మ్యాట్రిక్స్ హెడ్ ల్యాంప్స్, 19 అంగుళాల స్టైలిష్ అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లోపల క్యాబిన్ విషయానికి వస్తే, 15 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ 700 వాట్ ఆడియో సిస్టమ్ మీకు థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తాయి. ఫ్రంట్ సీట్లలో మసాజ్, వెంటిలేషన్ ఫీచర్లు ఉండటం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు కూడా హాయిగా సాగిపోతాయి.

సేఫ్టీ విషయంలో ఫోక్స్‌వ్యాగన్ అస్సలు రాజీ పడలేదు. ఇందులో ఏకంగా 9 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS ఫీచర్లు ఉన్నాయి. అంటే కారు దానంతట అదే ప్రమాదాలను గుర్తించి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్ వంటి దిగ్గజ కార్లకు ఈటైరాన్ గట్టి పోటీ ఇవ్వనుంది. పెట్రోల్ ఇంజిన్‌తో లగ్జరీ 7-సీటర్ కావాలనుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Tags

Next Story