Volkswagen : జర్మన్ టెక్నాలజీతో వణుకుతున్న ప్రత్యర్థులు..51 వేలకే లగ్జరీ రైడ్..టైరాన్ ఆర్ లైన్ రేంజే వేరు.

Volkswagen : జర్మన్ టెక్నాలజీతో వణుకుతున్న ప్రత్యర్థులు..51 వేలకే లగ్జరీ రైడ్..టైరాన్ ఆర్ లైన్ రేంజే వేరు.
X

Volkswagen : ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన ప్రీమియం 7-సీటర్ ఎస్‌యూవీ Tayron R-Line కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఫిబ్రవరి 2026లో అధికారికంగా లాంచ్ కానున్న ఈ కారును కస్టమర్లు కేవలం రూ.51,000 చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ఈ కారును భారత దేశంలోనే అసెంబుల్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. దీనివల్ల దిగుమతి చేసుకునే కార్ల కంటే దీని ధర కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పూర్తి ధరను వెల్లడించనప్పటికీ, లాంచ్ సమయంలో అదిరిపోయే ప్రైస్ ట్యాగ్‌తో రాబోతోందని సమాచారం. ఈ జర్మన్ ఎస్‌యూవీలో మొత్తం 23 వినూత్న ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా భద్రతకు పెద్దపీట వేస్తూ 14 లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లను అందించారు. ఇవి హైవే డ్రైవింగ్‌లో డ్రైవర్‌కు ఎంతో సహాయపడతాయి. ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో హైలైట్. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ నితిన్ కోహ్లీ మాట్లాడుతూ.. స్టైల్ మరియు యుటిలిటీ రెండూ కోరుకునే ఆధునిక కస్టమర్ల కోసం ఈ కారును డిజైన్ చేశామని తెలిపారు.

ఫార్చ్యూనర్ కోటను బద్దలు కొడుతుందా?

భారత మార్కెట్లో 7-సీటర్ ప్రీమియం సెగ్మెంట్లో టయోటా ఫార్చ్యూనర్ దశాబ్ద కాలంగా రారాజుగా వెలుగొందుతోంది. ఇప్పుడు టైరాన్ ఆర్-లైన్ దానికి నేరుగా పోటీ ఇవ్వబోతోంది. జర్మన్ ఇంజనీరింగ్, మోడ్రన్ ఇంటీరియర్స్, అధునాతన టెక్నాలజీతో వస్తున్న టైరాన్.. ఫార్చ్యూనర్ కస్టమర్లను తనవైపు తిప్పుకునే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఫార్చ్యూనర్‌కే కాదు.. స్కోడా కోడియాక్, ఎంజీ గ్లోస్టర్, జీప్ మెరిడియన్ వంటి కార్లకు కూడా గట్టి సవాల్ విసరనుంది.

మల్టీపర్పస్ లగ్జరీ ఎస్‌యూవీ

ఈ కారు కేవలం పెద్దదిగానే కాకుండా, నడపడానికి కూడా చాలా సరదాగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. తమ టాప్ లైన్ సెగ్మెంట్‌ను బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా టైరాన్‌ను తీసుకొచ్చారు. ఇండియాలో అసెంబ్లీ చేయడం వల్ల స్పేర్ పార్ట్స్ లభ్యత మరియు సర్వీసింగ్ ఖర్చులు కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. లగ్జరీ, ఫ్యామిలీ కంఫర్ట్ రెండూ కావాలనుకునే వారికి ఫిబ్రవరిలో రాబోతున్న ఈ జర్మన్ ఎస్‌యూవీ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.

Tags

Next Story