Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్

Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్
X

అరచేతిలో ప్రపంచం అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరికి క్లిక్ దూరంలో ఉంటున్నాం. వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్ ని తీసుకొస్తూ యూజర్స్ కి కిక్ ఇస్తుంది. వినియోగదారులు యూజర్ ఎక్స్ పీరియన్ని పెంచేందుకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్ ని తీసుకొ స్తుంది. ఇప్పటికే నెట్ లేకుండా దగ్గర్లో ఉన్న వారికి ఫైల్స్ సెండ్ చేసుకునే ఫీచర్, వాట్సాప్ లోంచి బయటకెళ్ళకుండానే ఆల్బమ్ పికర్ వంటి ఫీచర్ ను పరిచయం చేసింది.

ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్స్ వాట్సాప్ యూజర్స్ అందరికీ అందు బాటులోకి రానున్నాయి. కాగా వాట్సాప్ మరొక కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది. మరో కొత్త ఫీచర్ని వాట్సాప్ లో జోడిస్తున్నట్లు తెలిపింది. కొత్త మీడియా రియాక్షన్ షార్ట్ కట్ ను తీసుకొచ్చింది. మీడియా వ్యూవర్ స్క్రీన్ అంటే చాట్ లో కనిపించే ఫోటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజెస్ వంటి వాటికి ఫాస్ట్ గా రియాక్షన్ ఇవ్వడానికి ఈ రియాక్షన్ షార్ట్ కట్ ఉపయోగపడుతుంది.

ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నప్పుడు లేదా ఇన్ స్టాలో చాట్ చేస్తున్నప్పుడు మెసేజుల మీద డబుల్ క్లిక్ చేస్తే ఎలా అయితే లవ్ సింబల్ ఎనేబుల్ అవుతుందో.. అలా వాట్సాప్ లో ఎవరైనా పంపించిన వీడియోస్ కి, ఫోటోలకి లేదా మెసేజులు లవ్ సింబల్ తో క్విక్ రియాక్షన్ ఇవ్వచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే క్విక్ రియాక్షన్ వచ్చేలా వాట్సాప్ డెవలప్ చేసింది. ఈ ఫీచర్ లో డీఫాల్ట్ గా హార్ట్ సింబల్ మాత్రమే ఉంటుంది. టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్ గా రియాక్షన్ ఇవ్వాలనుకునేవారికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

Tags

Next Story