Whatsapp : సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సాప్

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరణ ఉన్నది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను జోడించబోతున్నది. ఈ ఫీచర్ సహాయంతో ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే ఫొటోలు, వీడియోలు, భారీ సైజ్ ఉన్న డాక్యుమెంట్ ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు యూజర్లకు అవకాశం కల్పించబోతున్నది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే రెండు డివైజ్‌ల మధ్య ఈ ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలుకలుగనున్నది. ఈ మేరకు సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తోందని వాట్సాప్‌బేటా ఇన్ఫో రిపోర్ట్ తెలిపింది. పెద్ద ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేందుకు గతంలో థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడిన వారికి సరికొత్త ఫీచర్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. భారీ ఫైల్స్‌ను సులభంగా షేర్ చేయడానికి వీలుంటుందని తెలిపింది. కొత్త ఫీచర్‌లో స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ సాయంతో రెండు పరికరాలను అనుసంధానించాల్సి చెప్పింది. తద్వారా సులభంగా ఫైల్స్ షేరింగ్ చేసుకోవచ్చు. కొత్త ఫీచర్ యూజర్ ప్రైవసీకి భరోసాను ఇస్తుందని పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ ప్రారంభంలో ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో చెప్పింది. ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని వాట్సాప్ భావిస్తోంది. వాట్సాప్ తీసుకురాబోయే ఈ ఫీచర్ ఆపిల్‌కు చెందిన ఎయిర్‌డ్రయిడ్, గూగుల్ నియర్‌బై షేర్ తరహాలోనే పని చేయనున్నది. ఫైల్‌ను షేర్ చేయడానికి ఇందులో స్కానర్ అందుబాటులో ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత రెండు ఫోన్‌లు ఒకదానితో ఒకటి జత చేస్తారు. గొప్ప విషయం ఏమిటంటే.. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉండదు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com