Elonmusk : నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్ రద్దు.. దాని మీద ఎలన్ మస్క్ కు ఎందుకంత కోపం ?

Elonmusk : నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్ రద్దు.. దాని మీద ఎలన్ మస్క్ కు ఎందుకంత కోపం ?
X

Elonmusk : నెట్‌ఫ్లిక్స్‎కు కష్టాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ఈ మధ్య నెట్‌ఫ్లిక్స్‌పై చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎలన్ మస్క్ ముందుగా తన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత Xలో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్‎ను కూడా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవాలని కోరారు. నెట్‌ఫ్లిక్స్ ట్రాన్స్‌జెండర్ అవేర్‌నెస్ ఎజెండాను నడుపుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం యానిమేటెడ్ సిరీస్ డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్ నిర్మాత హమీష్ స్టీల్‎తో ముడిపడి ఉంది.

సెప్టెంబర్ 10, 2025న, రైట్-వింగ్ రాజకీయ నాయకుడు చార్లీ కిర్క్‎ను కాల్చి చంపిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్‌కు సంబంధించిన నిర్మాత హమీష్ స్టీల్ సోషల్ మీడియాలో ఒక వివాదాస్పద పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో చార్లీ కిర్క్‌ను హేళన చేస్తూ, అతన్ని నాజీతో పోల్చారు. దీనితో వివాదం మరింత పెరిగింది. ఈ పోస్ట్ వైరల్ అయిన తర్వాత, ప్రజలు హమీష్ స్టీల్‌ను తీవ్రంగా విమర్శించారు. నెట్‌ఫ్లిక్స్ డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్ అనే యానిమేటెడ్ షో గురించి వివాదం ప్రారంభమైంది. ఈ షోలో బార్నీ అనే పాత్ర తాను ట్రాన్స్‌జెండర్ అబ్బాయిని అని చెప్పుకుంటుంది. ఒక సన్నివేశంలో నేను ట్రాన్స్, నార్మా... నేను పూర్తిగా కొత్త వ్యక్తిగా మారాను అని బార్నీ చెబుతాడు.

లిబ్స్ ఆఫ్ టిక్‌టాక్ ఈ సన్నివేశాన్ని షేర్ చేస్తూ, నెట్‌ఫ్లిక్స్ చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిపై ట్రాన్స్‌జెండర్ అనుకూల ఆలోచనలను రుద్దుతోందని ఆరోపించింది. ఎలన్ మస్క్ కూడా ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఇది సరికాదు అని రాశారు. హమీష్ స్టీల్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ప్రముఖ యానిమేటెడ్ సిరీస్ డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్‎కు నిర్మాత. అతని వివాదాస్పద పోస్ట్ కారణంగా చాలా మంది నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లను రద్దు చేసుకుంటున్నారు. ఎలన్ మస్క్ వంటి ప్రముఖ వ్యక్తి కూడా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ విషయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సామాజిక వివాదాలతో ముడిపడి ఉన్నప్పుడు ఎలన్ మస్క్ నెట్‌ఫ్లిక్స్‌ను వదిలివేయడం అనేక పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతుంది.

Tags

Next Story