Guinness World Record : 1.9 సెకన్లలోనే 100 వేగం..రికార్డులు తిరగరాసిన చైనా సూపర్ కార్.

Guinness World Record : 1.9 సెకన్లలోనే 100 వేగం..రికార్డులు తిరగరాసిన చైనా సూపర్ కార్.
X

Guinness World Record : చైనాకు చెందిన GAC హైప్‌టెక్ SSR (Hyptec SSR) ఎలక్ట్రిక్ సూపర్ కార్ సరికొత్త చరిత్ర సృష్టించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తాజాగా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు 213.523 కిలోమీటర్ల వేగంతో డ్రిఫ్ట్ చేసి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా డ్రిఫ్ట్ చేసిన ఎలక్ట్రిక్ కారుగా రికార్డు కెక్కింది. ప్రొఫెషనల్ డ్రైవర్ జేసన్ యే ఈ ఫీట్‌ను అద్భుతమైన నియంత్రణతో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బీజింగ్‌లో జరిగిన ఈ రికార్డ్ ప్రయత్నంలో కారును కేవలం వేగంగా నడపడమే కాకుండా, 50 మీటర్ల కంటే ఎక్కువ దూరం పాటు 30 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో డ్రిఫ్ట్ చేస్తూ నియంత్రించడం విశేషం. గతంలో 2022లో జీకర్ కారు పేరిట ఉన్న 207.996 కి.మీ. రికార్డును ఇది బ్రేక్ చేసింది. అయితే, పెట్రోల్ కార్ల విభాగంలో నిస్సాన్ GT-R నిస్మో (304.96 కి.మీ.) పేరిట ఉన్న రికార్డుతో పోలిస్తే ఇది తక్కువైనప్పటికీ, ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇదొక మైలురాయి.

https://www.instagram.com/reels/DU20yd4j7b7/

ఈ హైప్‌టెక్ SSR కారులో మూడు మోటార్ల ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది. ఇది సుమారు 1,224 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని వేగం ఎంతంటే, సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 1.9 సెకన్లలోనే అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 251 కిలోమీటర్లు. ఈ రికార్డ్ కేవలం చైనా ఆటోమొబైల్ సత్తానే కాకుండా, ఎలక్ట్రిక్ కార్ల పనితీరులో వస్తున్న విప్లవాత్మక మార్పులను కూడా ప్రపంచానికి చాటిచెప్పింది.

Tags

Next Story