ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ జ్యువెలరీ మాల్.. ఎక్కడో తెలుసా!!

ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ జ్యువెలరీ మాల్.. ఎక్కడో తెలుసా!!
సూరత్ డైమండ్స్ కు ప్రసిద్ధి చెందింది. అందుకే అక్కడ డైమండ్స్ కోసం ఏకంగా ఓ మాల్ నే నిర్మించారు. ఈ మాల్ లో కస్టమైజ్డ్ డైమండ్ ఆభరణాలను విక్రయిస్తారు.

సూరత్ డైమండ్స్ కు ప్రసిద్ధి చెందింది. అందుకే అక్కడ డైమండ్స్ కోసం ఏకంగా ఓ మాల్ నే నిర్మించారు. ఈ మాల్ లో కస్టమైజ్డ్ డైమండ్ ఆభరణాలను విక్రయిస్తారు. 50,000 చదరపు అడుగుల మాల్‌లో 27 డైమండ్ జ్యువెలరీ షోరూమ్‌లు ఉంటాయి. అగ్ర బ్రాండ్‌లకు వేదికగా నిలుస్తుంది ఈ మాల్. షోరూమ్‌లను అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వేలం వేసేందుకు సన్నహాలు చేస్తోంది.

డిసెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మాల్‌ను ప్రారంభించనున్నారు. గ్రౌండ్ ప్లస్-15-అంతస్తుల టవర్లలో ఈ మాల్ నిర్మితమైంది. ''ఇలాంటి డైమండ్ జ్యువెలరీ మాల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ హబ్‌తో పాటు, ఇది టాప్ గ్లోబల్ బ్రాండ్‌లను కూడా కలిగి ఉంటుంది , ”అని SDB ప్రెసిడెంట్ నాగ్జీ సకారియా అన్నారు. మాల్‌తో పాటు, కస్టమ్స్ అధికారులు క్లియరెన్స్‌లను వేగవంతం చేయడంలో సహాయపడేందుకు కస్టమ్స్ హౌస్‌ కూడా ఇక్కడ ఉంది.

ఇరపై డైమండ్స్ కొనాలనుకునేవారు ప్రపంచంలోనే అతిపెద్ద షోరూమ్ అయిన సూరత్ లోని ఈ మాల్‌కు వెళ్లి మీకు నచ్చిన డైమండ్స్ కొనుగోలు చేయవచ్చు అయి షోరూమ్ యాజమాన్యం తెలిపింది. USలోని పెంటగాన్ (66,73,624 చదరపు అడుగులు) కంటే ఇది పెద్దది.

“మేము ఇప్పటికే SDBలో ప్రపంచంలోని అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాము. డైమండ్ జ్యువెలరీ షోరూమ్ యజమానులు ఎస్‌డిబిలోని సేఫ్టీ వాల్ట్‌లను ఉపయోగించుకోవచ్చు” అని ఎస్‌డిబి సిఇఒ మహేష్ గధ్వి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story