Yamaha R15: కుర్రాళ్ల డ్రీమ్ బైక్ ధర భారీగా తగ్గింది..ఇప్పుడు కేవలం రూ.1.51లక్షలకే సొంతం చేసుకోండి.

Yamaha R15: కుర్రాళ్ల డ్రీమ్ బైక్ ధర భారీగా తగ్గింది..ఇప్పుడు కేవలం రూ.1.51లక్షలకే సొంతం చేసుకోండి.
X

Yamaha R15: యమహా మోటార్ ఇండియా తన ఐకానిక్ స్పోర్ట్స్ బైక్ యామహా R15 సిరీస్‌పై అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా ఈ బైక్ ధరలను భారీగా తగ్గించింది. జనవరి 5, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త ధరల వల్ల ఇప్పుడు R15 బైక్ మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. కొత్త ధరల వివరాలు, ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం.

యమహా గ్లోబల్ మార్కెట్లో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారత్‌లోని తన ఫ్లాగ్‌షిప్ బైక్ R15 ధరను రూ.5,000 మేర తగ్గించింది. ఈ తగ్గింపు R15 సిరీస్‌లోని అన్ని వేరియంట్లపై వర్తిస్తుంది. కేవలం ధరను తగ్గించడం మాత్రమే కాకుండా, ఈ స్పోర్ట్స్ బైక్‌ను సామాన్యులకు కూడా అందుబాటులోకి తేవడమే కంపెనీ లక్ష్యం. అయితే, ఈ ఆఫర్ ఎంతకాలం ఉంటుందనేది కంపెనీ వెల్లడించలేదు, కాబట్టి బైక్ కొనే ప్లాన్ ఉంటే ఇప్పుడే సరైన సమయం.

ఈ తగ్గింపు తర్వాత R15 శ్రేణి ధరలు కింది విధంగా ఉన్నాయి:

Yamaha R15 S: దీని ధర ఇప్పుడు రూ. 1,50,700 (సుమారు రూ.1.51 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. ఇది పాత R15 V3.0 మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Yamaha R15 V4: లేటెస్ట్ జెనరేషన్ వెర్షన్ ధర రూ.1,66,200 నుంచి ప్రారంభమవుతుంది.

Yamaha R15 M: హై-ఎండ్ ఫీచర్లు ఉన్న ఈ టాప్ మోడల్ ధర రూ.1,81,100 గా ఉంది. ధరలో మార్పు తప్ప, బైక్ ఫీచర్లలో లేదా ఇంజిన్ పర్ఫార్మెన్స్‌లో ఎటువంటి మార్పులు లేవు.

భారత్‌లో యమహా R15 ఎంత పాపులర్ అంటే, ఇప్పటివరకు ఈ బైక్ 10 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైంది. ఇందులో ఉన్న 155cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్, డెల్టాబాక్స్ ఫ్రేమ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు దీనిని రేసింగ్ ట్రాక్ మీద మాత్రమే కాదు, సిటీ రోడ్ల మీద కూడా కింగ్‌గా మార్చాయి. ముఖ్యంగా ఇందులోని బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, సెలెక్ట్ వేరియంట్లలో ఉండే క్విక్ షిఫ్టర్ వంటి ఫీచర్లు యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరలో ప్రీమియం స్పోర్ట్స్ బైక్ అనుభవం కావాలనుకునే వారికి R15 ఎప్పటికీ బెస్ట్ ఛాయిస్.

Tags

Next Story