Adipurush Trailer : ఆకట్టుకుంటున్న ఆదిపురుష్.. ట్రైలర్ రిలీజ్

రామాయణ కావ్యం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించారు. సీతారామలక్ష్మణులు అడవులకు వెళ్లినప్పటినుంచి తిరిగి రావణసంహారం అనంతరం అయోద్యకు చేరేంతవరకు సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఆంజనేయుడి వాయిస్ ఓవర్ తో ఆదిపురుష్ ట్రైలర్ లో మొదలైంది. "ఇది నా రాముడి కథ, ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ, ఆయనకున్న ధర్మం అధర్మానికున్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాధ. యుగయుగాల్లోనూ సజీవం, జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం". అంటూ ట్రైలర్ సాగిపోతుంది.
టీజర్ రిలీజ్ లో ఎదుర్కొన్న విమర్శలు ట్రైలర్ తో తొలిగిపోయాయనే చెప్పాలి. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, క్యారక్టరైజేషన్ వంకపెట్టకుండా తీర్చిదిద్చినట్లు తెలుస్తోంది. సీతాపహరణం తర్వాత ట్రైలర్ పై ఆసక్తి పెరుగుతుంది. ఒక్క సైగ చేస్తే అయోధ్య సైన్యం సీతాన్వేషణ చేయడానికి బయలుదేరుతది అని లక్ష్మణుడు అన్న మాటకు అది నా మర్యాదకు వ్యతిరేకం అని రాముడు ఇచ్చిన జవాబు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అన్వేషణలో ఆంజనేయుడి శక్తి ప్రదర్శణ, లంకా ప్రవేశం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రభాస్ లుక్ తో పాటు ఆహార్యం చక్కగా కుదిరింది. సీతాదేవిగా క్రితి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
చివరగా.. వానర సైన్యాన్ని ఉద్దేశించి రాముడు మాట్లాడుతూ... "నా కోసం పోరాడొద్దు, వేల సంవత్సరాల తర్వాత మీ తల్లులు మీ వీర గాధ చెప్తూ పిల్లలను పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా ..?... అయితే దూకండిముందుకు, అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి".. అంటూ లంకపై యుద్దానికి ముందడుగు వేస్తారు. ఈ సినిమా జూన్ 16న థియోటర్లలో విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=e3ew7YUeeQc
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com