Mangalavaram : టీవీలోకి 'మంగళవారం'

మోస్ట్ టాలెంటెడ్ భామ పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో నటించిన సినిమా 'మంగళవారం' టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ఆర్‌ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ హార్రర్ కామెడీ జోనర్ నవంబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై, సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మరోవైపు పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ +హాట్ స్టార్‌లో కూడా తన ఇంప్రెషన్‌ను మిస్ కాకుండా చూసుకుంది అజయ్ భూపతి టీం.
ఇక ఈ మూవీని థియేటర్లు, ఓటీటీలో చూడలేకపోయిన వారి కోసం ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. మంగళవారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ప్రీమియర్ కానుంది. ఇప్పటికే మంచి టాక్‌తోపాటు బెస్ట్ రివ్యూస్ రాబట్టుకున్న ఈ చిత్రానికి మరి టీవీలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైన మంగళవారం చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ చిత్రాన్ని ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com