Tandell : బుజ్జితల్లి పాటకు100 మిలియన్ల వ్యూస్, చైతూ రికార్డు..

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'తండేల్'. చందూ మొండేటి తెరకెక్కించిన ఈమూవీ.. సాంగ్స్, డైలాగులతో హిట్ టాక్ ను సొంతం చేసుకొని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది. త్వరలోనే 100 మిలియన్ల క్లబ్లో చేరబోతోంది. మూవీ టీం అన్ని సిటీల్లో సక్సెస్ మీట్ ను నిర్వహిస్తూ ఆడియన్స్ కు థ్యాంక్స్ చెబుతోంది. మరోవైపు ఈ సినిమాలోని 'బుజ్జితల్లి’పాట రికార్డు మైలోస్టోన్ అందుకుంది. ఈ లవ్ సాంగ్ యూట్యూ బ్లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈవిషయాన్ని తెలుపుతూ గీతా నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. బిగ్ స్క్రీన్ పై ఈ పాటను ఎక్కువమంది ఎంజాయ్ చేశారని పేర్కొంది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి జావేద్ అలీ ఆల పించిన తీరు యూత్ ను బాగా ఆక ట్టుకుంది. శ్రీమణి సాహిత్యం హైలైట్ గా నిలిచింది. ఇక బుజ్జితల్లి సాంగ్ శాడ్ వెర్షన్ కూడా వైరలవుతోన్న విషయం తెలిసిందే. నాగచైతన్య తాజాగా అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ‘తండేల్’ మూవీతో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాడు. దీంతో ఈ మైలురాయి అందుకున్న తొలి అక్కినేని హీరోగా నాగ చైతన్య నిలిచాడు. ఇప్పటి వరకు నాగార్జున కానీ అఖిల్ కానీ ఈ ఫీట్ అందుకోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com