Tollywood Top Stars : టాప్ స్టార్స్ లేని 2025 సమ్మర్

సమ్మర్ అనేది ఇండియాలో ఏ సినిమా ఇండస్ట్రీకైనా బిగ్గెస్ట్ సీజన్. అందుకే మాగ్జిమం టాప్ స్టార్స్ అంతా తమ సినిమాలు సమ్మర్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే టాలీవుడ్ లో కొన్నాళ్లుగా టాప్ స్టార్స్ సమ్మర్ ను మిస్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 2024 సమ్మర్ అయితే చాలా అంటే చాలా చప్పగా ఉంది. మీడియం రేంజ్ హీరోలు వచ్చినా.. ఎవ్వరూ పెద్ద హిట్ కొట్టలేకపోయారు. అలా వచ్చిన అవకాశాన్ని ఎవరూ వాడుకోలేదు. ఇటు పెద్ద హీరోలు సమ్మర్ ను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సారి సమ్మర్ కు కూడా అదే పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది.
2025 సమ్మర్ లో కూడా టాప్ స్టార్స్ సినిమాలేం లేవు. ముందుగా ప్రభాస్ రాజా సాబ్ వస్తుందనుకుంటే అది వాయిదా పడింది. ఒకవేళ వస్తే విశ్వంభరకు మాత్రం అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ల సినిమాలేం లేవు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మార్చి 28 అన్నారు కానీ రావడం లేదు అని తేలిపోయింది. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఓజి సంగతి ఎవరూ చెప్పలేకపోతున్నారు. మహేష్ .. రాజమౌళితో లాక్ అయి ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది రాజమౌళి కూడా చెప్పలేడేమో. ఎన్టీఆర్ వార్ 2 ఆగస్ట్ 15 కి వస్తుంది. అల్లు అర్జున్ నుంచి మరో రెండేళ్ల వరకూ సినిమా రాదు అనుకోవచ్చు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇది దసరా లేదా సంక్రాంతి అంటున్నారు. సో టాలీవుడ్ కే టాప్ అని చెప్పుకునే వీళ్లెవరూ సమ్మర్ రేస్ లో లేరు.
ఇక నాని నటిస్తోన్న హిట్ 3 మూవీ మే 1న విడుదల కాబోతోంది. మే 9న రవితేజ మాస్ జాతర, మే 30న విజయ్ దేవరకొండ సినిమా విడుదలవుతున్నాయి. ఏప్రిల్ లో సిద్ధు జొన్నలగడ్డ జాక్, అనుష్క ఘాటీ, తేజ సజ్జా, మిరాయ్, విష్ణు మంచు కన్నప్ప చిత్రాలు కాస్త పెద్దగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమ్మర్ మరీ లాస్ట్ సమ్మర్ లా పేలవంగా ఉండకపోవచ్చు. ఈసినిమాల్లో చాలా వరకు ఎంటర్టైన్ చేసేలానే ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com