Prabhas : 2026లో ప్రభాస్ వీరంగం

ప్రభాస్ మూవీస్ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే 2025 సమ్మర్ లో విడుదల కావాల్సిన రాజా సాబ్ 2026 జనవరి 9న విడుదల కాబోతోంది. అయితే ఈ ఆలస్యం మొత్తానికి ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ యేడాది మాత్రం ఏకంగా మూడు సినిమాలు విడుదల చేయబోతున్నాడు. ఆ మూడూ కూడా మామూలు సినిమాలు కాదు. రాజా సాబ్ ఎలాగూ వస్తోంది. ఇదో హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా. ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ లాంటి హారర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ చేయడం మాత్రం అత్యంత అరుదు. స్టార్ హీరోల విషయంలో మాత్రం అప్పట్లో మోహన్ లాల్, తర్వాత చంద్రముఖితో రజినీకాంత్ మాత్రమే చేశాడు. అలాంటి ప్రభాస్ కూడా అలాంటి సినిమా చేయడం మాత్రం నిజంగా ఓ రికార్డ్.
ఇక ఆ తర్వాత మూవీ మాత్రం ఫౌజీ రాబోతోంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఫౌజీ. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ చేశారు. ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉంటుందని టాక్. దీంతో పాటు ఓ మంచి ప్రేమకథ కూడా యాడ్ చేశారని చెబుతున్నారు. ఈ మూవీ ఖచ్చితంగా ఈ యేడాదే విడుదల కాబోతోంది. ఓ వైపు షూటింగ్ తో పాటు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడట దర్శకుడు. సో.. ఈ యేడాది రెండో సినిమాగా మాత్రం ఫౌజీ ఉండబోతోంది.
ఆ తర్వాత మూడో సినిమా స్పిరిట్ తో రాబోతోంది. స్పిరిట్ షూటింగ్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా పూర్తి చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా. అతని చిత్రాలకు పెద్దగా విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తో పనిలేకుండా ఉంటాయి కాబట్టి వేగంగా సినిమా పూర్తి కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ జనవరిలో మరో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అన్నీ కుదిరితే ఈ స్పిరిట్ మూవీని మాత్రం 2026 దసరాకే విడుదల చేయాలనుకుంటున్నాడు సందీప్ రెడ్డి. సో.. ఇదే నిజమైతే మాత్రం.. ఈ యేడాది ఏకంగా మూడు సినిమాలు విడుదల చేస్తాడట ప్రభాస్. కనీసం రెండు సినిమాలైతే మాత్రం పక్కా. సో లాస్ట్ ఇయర్ లాస్ ను ఈయేడాది పూర్తి చేయబోతున్నాడన్నమాట.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

