Rashmika : ఆ గాయం మానేందుకు 9 నెలలు: రష్మిక

Rashmika : ఆ గాయం మానేందుకు 9 నెలలు: రష్మిక
X

తన కాలి గాయం మానేందుకు 9 నెలల సమయం పడుతుందని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. సోషల్ మీడియలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం కొంత కోలుకున్నానని, నడవగలుగుతున్నానని చెప్పారు. అలాగే తనకు ఎత్తైన ప్రదేశాలు, నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాలంటే చాలా భయమని పేర్కొన్నారు. కాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. గాయంతోనే ‘ఛావా’ ప్రమోషన్లకు హాజరయ్యారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. త్వరలోనే ఇది రూ.100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఆమెకు హైదరాబాద్, బెంగళూరు, కూర్గ్, ముంబై, గోవాలో సొంత ఇళ్లు ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని వెల్లడించాయి. దక్షిణాదిలో సంపాదనపరంగా రష్మికనే నంబర్‌వన్ అని చెప్పాయి.

Tags

Next Story