Prabhas : ప్రభాస్, త్రిష.. అంత తూఛ్

Prabhas :  ప్రభాస్, త్రిష.. అంత తూఛ్

డార్లింగ్ స్టార్ ప్రభాస్ మూవీస్ లైనప్ చూస్తే మరో మూడేళ్ల వరకూ ఖాళీగా లేడు. రీసెంట్ గానే కల్కితో మరోసారి వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఈ బాక్సాఫీస్ బాహుబలి ప్రస్తుతం రాజా సాబ్ కోసం బిజీగా ఉన్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. ఇక ఈ ఇండిపెండెన్స్ డే రోజున హను రాఘవపూడితో మూవీ స్టార్ట్ కాబోతోంది. ఆ రోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అవుతుంది. 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళుతుందని టాక్. అంటే మారుతి, హను రాఘవపూడి మూవీస్ షూటింగ్స్ లో ఒకేసారి పార్టిసిపేట్ చేస్తాడన్నమాట. సో.. ఇప్పటికి ఈ మూవీస్ కు సంబంధించిన హడావిడీలో ప్రభాస్ ఉంటే సడెన్ గా సందీప్ రెడ్డి వంగా మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోందనే రూమర్ ఒకటి హల్చల్ చేస్తోంది.

ప్రభాస్, త్రిష కలిసి వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు మూవీస్ లో నటించారు. పౌర్ణమి ఫ్లాప్ అయినా బుజ్జిగాడు యావరేజ్ అనిపించుకున్నా.. ఈ జోడీ మాత్రం మూడు సినిమాల్లోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. అందుకే ఈ ఇద్దరూ కలిసి నటించబోతున్నారు అనే న్యూస్ రాగానే వైరల్ అయింది. బట్ అది అఫీషియల్ న్యూస్ కాదు.జస్ట్ రూమర్ మాత్రమే. ఆ మాటకొస్తే.. సందీప్ రెడ్డి.. ఇంకా ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ నే కంప్లీట్ చేయలేదు. స్క్రిప్ట్ అయితే కదా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేది. సో.. అసలు త్రిషతో అతను మాట్లాడాడు అనేదే అబద్ధం. పైగా ఇప్పుడు త్రిష ఉన్న స్టార్డమ్ ఫేజ్ కు కథ వినకుండా కేవలం ప్రభాస్ పేరు చెప్పగాన ఓకే చెబుతుంది అనేది అసాధ్యం. అంచేత ఈ కాంబినేషన్ సెట్ అయింది అనేది పూర్తిగా అవాస్తవం.. బేస్ లెస్ రూమర్.

Tags

Next Story