Tollywood : మట్కా నుంచి బ్లాక్ అండ్ వైట్ పోస్టర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మట్కా’. నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. 15 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందని తెలియజేస్తూ రెట్రో లుక్‌లో వరుణ్, మీనాక్షిల బ్లాక్ అండ్ వైట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. పలాస 1978 ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైరా, SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 14న ఐదు భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎ కిషోర్ కుమార్ డీవోపీగా పని చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com