Tollywood : దీపావళికి గేమ్ ఛేంజర్ టీజర్

Tollywood : దీపావళికి గేమ్ ఛేంజర్ టీజర్
X

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి ఆదివారం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలో టీజర్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ కుర్చీలో కూర్చుంటే ఎదురుగా చాలా మంది రౌడీలు వస్తున్నట్టు ఉంది. మరో 75 రోజుల్లో సినిమా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. త్వరలోనే దీపావళి కావడంతో ఆ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్ అవుతుందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల, ఎస్ జే సూర్య వంటి పలువురు ప్రముఖ స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Tags

Next Story