Mahesh Babu : మహేష్ నుంచి సరైన డిమాండ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి ఓ కొత్త డిమాండ్ కనిపిస్తోంది. అఫ్ కోర్స్ దీన్ని మరీ డిమాండ్ అనలేం కానీ.. సింపుల్ గా కోరిక అనుకోవచ్చు. అది తెలిస్తే వాళ్లు చెప్పేదీ బానే ఉంది కదా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఆయన హెయిర్ స్టైల్ తోనే ఇబ్బంది వస్తోంది. ఇంతకీ మహేష్ బాబు అభిమానుల కోరిక ఏంటా అనుకుంటున్నారా.. ఏముందీ.. ప్రభాస్ ను ఫాలో అయితే బెటర్ గా ఉంటుంది కదా అని. అదెలా.. అసలిదేం కోరిక అనిపిస్తోందా.. నిజమే.. అలా అనిపించడంలో తప్పు లేదు కానీ.. ఇది చదివాక అభిప్రాయం మారుతుంది.
రాజమౌళితో మూవీ అంటే కనీసం మూడేళ్లు లాక్ అవ్వాల్సిందే. మహేష్ లాంటి హీరోతో ఇంటర్నేషనల్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటే ఇంకా ఎక్కువ టైమ్ పట్టినా ఆశ్చర్యం లేదు. అందుకే ఫ్యాన్స్ ఏం అడుగుతున్నారంటే ఈ లోగా ఓ చిన్న తరహా సినిమా చేస్తే బావుంటుంది కదా అని. గతంలో ప్రభాస్ బాహుబలికి కమిట్ అయిన తర్వాతే కొరటాల శివతో మిర్చి అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దానికి ముందు చేసిన రెబల్ డిజాస్టర్ అయినా.. ఆ ఎఫెక్ట్ లేకుండా మిర్చితో పాజిటివ్ నోట్ లో బాహుబలికి కలిసొచ్చింది. అలాంటిదే ఇప్పుడు మహేష్ బాబు కూడా చేస్తే బావుంటుంది కదా అనేది అభిమానుల అభిప్రాయం. నిజానికి ఇది బానే ఉంది. కాకపోతే జనవరి నెల నుంచే రాజమౌళి మూవీ పట్టాలెక్కబోతోంది. ఇందుకోసం మేకోవర్ తో రెడీ అవుతున్నాడు. ఈ టైమ్ లో కొత్త సినిమా అంటే కచ్చితంగా టైమ్ సరిపోదు. ఇదేదో ముందే చేసి ఉంటే ఇంకా ఈ ప్రాబ్లమ్ ఉండేది కాదేమో. ఏదేమైనా ఇప్పుడు అనుకుని ఏం లాభం. ఇక మహేష్ మూవీ కోసం ఫ్యాన్స్ 2028 వరకూ వెయిట్ చేయాల్సిందేనేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com