Prabhas : ప్రభాస్ కు విలన్ గా మెగా హీరో

Prabhas :  ప్రభాస్ కు విలన్ గా మెగా హీరో
X

రెండు కథలు, మూడు సినిమాలతోనే కంట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అతని సినిమా అంటే ఆడియన్స్ లో ముఖ్యంగా.. యూత్ తో పాటు అస్పైర్డ్ ఫిల్మ్ మేకర్స్ లోనూ ఓ రకమైన కుతూహలం నెలకొంటోంది. ఆ స్థాయిలో తన హీరోలను ప్రెజెంట్ చేస్తున్నాడు. యానిమిల్ లో చాక్లెట్ బాయ్ లాంటి రణ్ బీర్ కపూర్ ను బ్లడ్ షెడ్ లో ముంచేశాడు. ఆడియన్స్ అదరహో అనేశారు. అదీ అతని సత్తా. తన హీరోలను రెగ్యులర్ డైరెక్టర్స్ కు భిన్నంగా కాస్త వైల్డ్ గా చూపించడంలో అప్పుడే ఎక్స్ పర్ట్ అనిపించుకున్నాడు. అలాంటి దర్శకుడు ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఇంక చెప్పేదేముందీ. టైటిల్ అయితే స్పిరిట్ అన్నారు. కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ఓపెనింగ్ లాంటివేం జరగలేదు. అయినా అప్పుడే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇంకా చెబితే ప్రభాస్ ఇప్పుడు చేస్తోన్న మూవీస్ కంటే ఎప్పుడో వచ్చే సందీప్ సినిమా కోసమే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. మరి ఆ రేంజ్ మూవీలో ప్రభాస్ కు ధీటుగా ఎలాంటి విలన్ ఉండాలి..? అందుకే ఆ మధ్య కొరియన్ నటుడు డాన్ లీ పేరు వినిపించింది. ఇతను కొరియన్ మూవీస్ ను రెగ్యులర్ గా చూసేవాళ్లందరికీ బాగా పరిచయం. అయితే లేటెస్ట్ గా మరో సర్ ప్రైజింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. అదీ మెగా ఫ్యామిలీ హీరో ప్రభాస్ కు విలన్ గా నటించబోతున్నాడు అని.

యస్.. ఆ విలన్ నటుడు ఎవరో కాదు. గద్దలకొండ గణేష్ గా తనలోని నెగెటివ్ షేడ్స్ ను అద్భుతంగా పర్ఫార్మ్ చేసిన వరుణ్ తేజ్. సందీప్ - ప్రభాస్ కాంబోలో రాబోతోన్న స్పిరిట్ లో ఓ విలన్ గా వరుణ్ తేజ్ ను సంప్రదిస్తున్నారు అనే రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కొన్నాళ్లుగా వరుణ్ హీరోగా అన్నీ ఫ్లాపులే చూస్తున్నాడు. ఈ టైమ్ లో సందీప్ మూవీలో విలన్ రోల్ అంటే అతని కెరీర్ ఖచ్చితంగా కొత్త టర్న్ తీసుకుంటుంది. పైగా ప్రభాస్ హీరో కాబట్టి అతను కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో షైన్ అవుతాడు. అయితే ఇది నిజమా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయిన ప్రభాస్ లాంటి టాప్ స్టార్స్ మూవీస్ విషయంలో ఇలాంటి రూమర్స్ కామన్ గానే వస్తాయి. కాకపోతే ఇది నిజమే అయితే ఖచ్చితంగా అది వరుణ్ తేజ్ కెరీర్ కు బెస్ట్ అవుతుందని చెప్పొచ్చు.

Tags

Next Story