NTR - Neel : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీపై కొత్త రూమర్

NTR - Neel :  ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీపై కొత్త రూమర్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాసివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీపై భారీ అంచనాలున్నాయి. నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. వచ్చే యేడాది జూన్ 25న విడుదల చేస్తాం అని ఇంతకు ముందు ప్రకటించారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా టోవినో థామస్ మరో కీలక పాత్రలో నటించబోతోన్న ఈ మూవీ గురించి లేటెస్ట్ గా ఓ కొత్త రూమర్ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్, నీల్ ఇద్దరూ ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్నవాళ్లే. అయినా మరో ప్యాన్ ఇండియా బ్యూటీ కూడా ఉంటే బావుంటుందనుకుంటున్నారట. అందుకే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

శ్రద్ధా కొన్నాళ్ల క్రితం ప్రభాస్ తో కలిసి సాహో చిత్రంలో నటించింది. తర్వాత తను స్త్రీ, స్త్రీ 2 చిత్రాలతో ఓ స్టార్ హీరో రేంజ్ సంపాదించుకుంది. స్త్రీ 2 లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది. పైగా బాలీవుడ్ లో శ్రద్ధాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అలాంటి బ్యూటీ ఈ మూవీలో ఉంటే డ్రాగన్ కు మరింత పవర్ వస్తుందనుకుంటున్నారట.

ప్రస్తుతానికైతే ఇదో రూమర్ గానే కనిపిస్తోంది. నిజమా కాదా అనేది మూవీ టీమ్ రివీల్ చేస్తేనే బెటర్. ఏదేమైనా ఇలాంటి భారీ అంచనాలున్న స్టార్ హీరోల సినిమాల గురించి ఇలాంటి రూమర్స్ రెగ్యులర్ గా కనిపించేవే.

Tags

Next Story