Nayanthara : నయన్ స్టోరీలోకి సూపర్ స్టార్ ఎంట్రీ

Nayanthara : నయన్ స్టోరీలోకి సూపర్ స్టార్ ఎంట్రీ
X

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ ' అనే డాక్యుమెంటరీ కోలీవుడ్ లో వివా దానికి దారి తీసిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీ కారణంగానే ఇన్ని రోజులు నివురుగప్పిన నిప్పులా ఉన్న నయనతార, ధనుష్ ల కోల్డ్ వార్ ఒక్కసారిగా బరస్ట్ అయింది. మూడు సెకండ్ల వీడియో క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయడంతో నయనతార ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ వ్యవహారంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ఇన్ స్టా పోస్ట్ మరింత ఆసక్తి కరంగా మారింది. నయన్ ఫ్యామిలీ ఫోటో ను ఇన్ స్టా స్టోరీ గా పెడుతూ లవ్ సింబల్ జత చేస్తూ షేర్ చేసారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ధనుష్ తో నయనతార వ్యవహారనికి సంబంధించి ఒక స్టార్ హీరో పై ధైర్యంగా మాట్లాడావ్..? లేదా ఎన్నో అవమానాలు ఎదుర్కొని నేడు లేడీ సూపర్ స్టార్ రేంజ్ కు చేరుకున్నావ్..? అని అభినందిస్తూ ఈ పోస్ట్ చేశారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Tags

Next Story