Aishwarya Menon : అందాల ఐశ్వర్యం.. ఈ ఫొటోలు చూశారా!

Aishwarya Menon : అందాల ఐశ్వర్యం.. ఈ ఫొటోలు చూశారా!
X

తమిళ, తెలుగు. మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్యా మీనన్. అందంతో కుర్రకారు మనసు దోచేసింది. నిఖిల్ ‘స్పై'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. గతేడాది యంగ్ హీరో కార్తికేయకి జోడిగా ‘భజేవాయు వేగం ' చిత్రంలో నటించి హిట్ అందుకుంది. మూవీలతో పాటు కొన్ని షార్ట్ ఫిల్మ్లోనూ నటించింది ఐశ్వర్య. అలాగే థియేటర్లో కూడా పనిచేసింది. ప్రస్తుతం తమిళ్ రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడుకు .. త్వరలోనే తెలుగులో మరిన్ని మూవీల్లో నటించే అవకాశం వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ వయ్యారికి మంచి క్రేజ్ ఉంది. రెగ్యూలర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్స్టాలో షేర్చేస్తూ యువత మదిని దోచేస్తుంది. తాజాగా ఐశ్వర్య తన నడుము అందాలను చూపిస్తూ క్యూట్ గా పోజు ఇచ్చింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ ఇంతటి అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదని, రావాల్సిన గుర్తింపు రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story