Aamir Khan : సౌత్ డామినేషన్ పై అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్

Aamir Khan : సౌత్ డామినేషన్ పై అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్
X

దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్నాయి. బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. బాలీవుడ్ ఇలా పతనం కావడంపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది సినిమానా? లేక దక్షిణాది సినిమానా? అనేది ముఖ్యం కాదని ఆమిర్ అన్నారు. బాలీవుడ్ వెనుకబడటానికి ఓటీటీలే కారణమని చెప్పారు. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న ప్రేక్షకులు కొన్ని వారాల తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారని అన్నారు. ఓటీటీలు లేనప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూసేవాళ్లని చెప్పారు. ఇప్పుడు సినిమా ఎంతో నచ్చితే తప్ప థియేటర్లకు వచ్చి చూడటం లేదని అన్నారు. సినిమాను ఎక్కడి నుంచైనా చూడొచ్చనే బిజినెస్ మోడల్ తో మన సినిమాలను మనమే చంపుకుంటున్నామని చెప్పారు. అందరూ దయచేసి థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని కోరారు.

Tags

Next Story