Aamir Khan : మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్?

Aamir Khan : మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్?
X

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ బెంగళూరుకు చెందిన ఓ మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల తన కుటుంబసభ్యులకు ఆమెను పరిచయం చేశారని, వీరి పెళ్లికి కూడా వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే 59 ఏళ్ల ఆమిర్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కుతారని సమాచారం. కాగా గతంలో రీనా దత్తా, కిరణ్ రావును ఆయన పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. ఆమిర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ప్రస్తుతం గత మూడు సంవత్సరాల నుంచి ఆయన ముఖానికి మేకప్ వేసుకోకుండా ఖాళీగానే ఉంటున్నాడు. ఎలాంటి సినిమాలు చేయాలి ఏ సినిమా చేస్తే సూపర్ సక్సెస్ ని సాధిస్తాను అనే ధోరణిలోనే ఆయన ఇంకా ఆలోచనల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న పోటీని ఎదురుకోవాలంటే వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు చేయాలని ఒక టార్గెట్ ను తను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.

దాని కోసమే కథల ఎంపికలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ‘లాల్ సింగ్ ఛద్దా సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఆయన ఇంకా మరొక సినిమా చేయకపోవడం పట్ల అతని అభిమానులు తీవ్రమైన నిరాశకు గురి అవుతున్నారనే చెప్పాలి.

Tags

Next Story