ఆ చేత్తోనే మాక్కూడా సాయం చేయండి: విజయ దేవరకొండతో డిస్ట్రిబ్యూటర్స్

ఆ చేత్తోనే మాక్కూడా సాయం చేయండి: విజయ దేవరకొండతో డిస్ట్రిబ్యూటర్స్
మీదెంత పెద్దమనసు.. ఫ్యాన్సుకు కోటి రూపాయలు పంచుతానన్నారు.

మీదెంత పెద్దమనసు.. ఫ్యాన్సుకు కోటి రూపాయలు పంచుతానన్నారు. మరి మీతో సినిమా తీసి నష్టపోయిన మాక్కూడా అంతో ఇంతో సాయం అందిస్తే సంతోషిస్తాం కదా అని అంటున్నారు వరల్డ్ ఫేమస్ లవర్ డిస్ట్రిబ్యూటర్స్..

ప్రస్తుతం విజయదేవరకొండ ఖుషి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా సంపాదనలో నుంచి కోటి రూపాయలను అభిమానులకు ఇస్తానని ప్రకటించారు. విజయ్ గొప్ప మనసుకు పలువురు నెటిజన్స్ ఆయన్ను అభినందించారు. అయితే ఇప్పుడదే విజయ్ ని చిక్కుల్లో పడేసింది అని అనుకోవచ్చు. విజయ్, రష్మిక నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ కమర్షియల్ గా హిట్టవ్వలేదు.

దాంతో పాపం సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. దాంతో ఇప్పుడు విజయ్ డబ్బులు పంచుతాననే సరికి వారు కూడా ముందుకు వచ్చి మేం నష్టపోయిన డబ్బు మాక్కూడా ఇవ్వండి అంటున్నారు డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్. ఈ మేరకు విజయ్ కి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.

ట్వీట్ సారాంశం.. డియర్ విజయ్ దేవరకొండ.. సినిమా పంపిణీలో రూ.8 కోట్లు నష్టపోయాం. దానిపై ఎవరూ స్పందించలేదు. మీరు సహృదయంతో కోటి రూపాయలను పలు కుటుంబాలకు అందివ్వనున్నారు. మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాం అని ట్వీట్ లో పేర్కొంది. 2020లో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ ను అభిషేక్ పిక్చర్స్ ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story