Stunt Master Raju : షూటింగ్ సమయంలో ప్రమాదం... స్టంట్ మాస్టర్ మృతి..

Stunt Master Raju : షూటింగ్ సమయంలో ప్రమాదం... స్టంట్ మాస్టర్ మృతి..
X

కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ సమయంలో గుండెపోటుకు గురై మృత్యు వాత పడ్డారు స్టంట్ మాస్టర్ రాజు(52). కారుతో స్టంట్స్ చేస్తున్న సమయంలో ఆయన గుండెపోటుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే చిత్ర బృందం ఆయనను ఆసుపత్రి కి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయారు.

హీరో ఆర్య, డైరెక్టర్ పా.రంజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. ఐతే కారు ను తిప్పే సన్నివేశం వేస్తున్న సమయంలో ఆయన గాయపడి చనిపోయినట్లు గా కూడా వార్తలు వస్తున్నాయి...దీనిపై చిత్ర బృందం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇక రాజు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హీరో విశాల్. రాజు తనకు చాలా ఏళ్లుగా తెలుసని తన చిత్రాల్లో అనేక ప్రమాదకరమైన స్టంట్‌లు చేశాడని గుర్తు చేసుకున్నారు. అతను చాలా ధైర్యవంతుడు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటున్నా" అని విశాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.

హైరిస్క్ యాక్షన్ సీక్వెన్స్ లను నిర్భయంగా తెరకెక్కించడంలో నిపుణుడు స్టంట్ ఆర్టిస్ట్ రాజు. అనేక కోలీవుడ్ చిత్రాలకు అయాన పని చేశారు. తన సాహసోపేతమైన అనేక స్టంట్ లతో చిత్ర ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు. రాజు మరణం తో ఆయన సహచరులు, మిత్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Tags

Next Story