Pratap Pothen: సినీ ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

Pratap Poten: ప్రఖ్యాత నటుడు మరియు చిత్రనిర్మాత అయిన ప్రతాప్ పోతన్ గురువారం అర్థరాత్రి గుండెపోటుకు గురై చెన్నైలోని తన అపార్ట్‌మెంట్‌లో తుదిశ్వాస విడిచారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. మలయాళ చిత్రాల ద్వారా తన నట జీవితానికి శ్రీకారం చుట్టారు. అతను ఆవారం, థకరా, లారీ వంటి మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మూడుపని, వరుమయిన్ నిరమ్ శివప్పు, పన్నీర్ పుష్పంగళ్ వంటి సినిమాలతో తమిళంలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటనలో రాణిస్తూనే 1980 కాలంలో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. అతడు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'మీందుం ఒరు కథల్ కథై' ఉత్తమ తొలి చిత్రంగా ఇందిరా గాంధీ అవార్డును గెలుచుకుంది. కమల్ హాసన్‌తో వెట్రి విజయ, మలయాళంలో మోహన్‌లాల్‌తో ఒరు యాత్రమొళి అతని ఇతర ప్రముఖ చిత్రాలలో కొన్ని. మలయాళం మరియు తమిళంలో మొత్తం 12 చిత్రాలకు ప్రతాప్ పోతన్ దర్శకత్వం వహించారు.
ఆయన నటించిన చివరి చిత్రాలలో సీబీఐ 5: ది బ్రెయిన్ ఒకటి కాగా, మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన బరోజ్: గార్డియన్ ఆఫ్ డి'గామాస్ ట్రెజర్ ఉన్నాయి. తమిళంలో, అతను చివరిసారిగా 2D ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన జ్యోతిక నటించిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ పొన్మగల్ వంతల్‌లో కనిపించారు. పార్థిబన్ మరియు విజయ్ సేతుపతి నేతృత్వంలో గత ఏడాది వచ్చిన రాజకీయ హాస్య చిత్రం తుగ్లక్ దర్బార్‌లో అతిధి పాత్రలో కనిపించారు.
తన విచిత్రమైన డైలాగ్ డెలివరీతో అభిమానులను ఆకట్టుకున్నారు. అతను 22 ఫిమేల్ కొట్టాయంలో కరుడు గట్టిన విలన్ పాత్ర పోషించి అన్ని జోనర్‌లలో ఇమిడిపోగలనని నిరూపించుకున్నారు. ఆయన చేసిన ఆకలిరాజ్యం, కాంచనగంగ, జస్టిస్ చక్రవర్తి, చుక్కల్లో చంద్రుడు, మరో చరిత్ర, వీడెవడు చిత్రాల ద్వారా తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో వచ్చిన చైతన్య అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి రాధికను 1985లో వివాహం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో వివాహమైన ఏడాదిలోనే వీరిద్దరూ విడిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com