Sonu Sood : బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు సోనూ సూద్...

Sonu Sood : బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు సోనూ సూద్...
X

అక్రమ బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా ఈ కేసులో పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్, సురేష్ రైనా, సినీ నటులు మిమి చక్రవర్తి, ఊర్వశి రౌతేలా అంకుష్ హజ్రా లు గతంలో విచారణకు హాజరయ్యారు. తాజాగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు సోనూ సూద్ హాజరయ్యారు. కాగా విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags

Next Story