Actor Sonu Sood : నటుడు సోనూసూద్‌ అరెస్ట్‌కు వారెంట్

Actor Sonu Sood : నటుడు సోనూసూద్‌ అరెస్ట్‌కు వారెంట్
X

నటుడు సోనూసూద్‌కు లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మోహిత్ అనే వ్యక్తి ‘రిజికా కాయిన్‌’లో పెట్టుబడి పేరుతో ₹10L మోసం చేశాడని, దీనికి సోనూసూద్ సాక్షి అని పేర్కొంటూ రాజేశ్ అనే లాయర్ కేసు వేశారు. కోర్టు పంపిన సమన్లకు సోనూసూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు. లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్‌ ఖన్నా తనకు మోహిత్‌ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్‌ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు.

తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ సోనూసూద్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో 'అరుంధతి' సినిమాలో విలన్ రోల్‌లో 'పశుపతి'గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమాల్లో విలన్ రోల్స్ పోషించిన సోనూసూద్.. రియల్ లైఫ్‌లో సేవా కార్యక్రమాలతో అందరికీ దేవుడయ్యారు. కొవిడ్ సమయంలో ఆయన ధాతృత్వంతో చాలామందిని ఆదుకుని గొప్ప మనసు చాటుకున్నారు. అంతే కాకుండా 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్సులు అందించి ఉదారత చాటుకున్నారు. అంతే కాకుండా ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం ఇలా అవసరం ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తున్నారు ఈ రియల్ హీరో.

Tags

Next Story