Actress Kavitha: సీనియర్ నటి కవిత చనిపోయిందంటూ వార్తలు.. ఒక్క వీడియోతో క్లారిటీ..

Actress Kavitha: Actress Kavitha:సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం చాలా కష్టంగా మారింది. ఒక్కొక్కసారి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కూడా చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ ఉంటుంది. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. తాజాగా ఓ సీనియర్ నటిపై కూడా అలాంటి వార్తలే వస్తుండగా ఆమె ఈ విషయాలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో వందల సినిమాల్లో నటించారు సీనియర్ నటి కవిత. అమ్మగా, అత్తగా, విలన్‌గా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఎన్నో సంవత్సరాల నుండి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా కవిత నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నా కూడా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో కవిత చనిపోయింది అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తను చనిపోయిందంటూ వస్తున్న వీడియోలు చూసి తన స్నేహితులు, బంధువులు భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు కవిత. తాను చెన్నైలో ఓ సీరియల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, ఆ వీడియోలను అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లు వాటిని డిలీట్ చేయకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని వారికి వార్నింగ్ ఇచ్చారు కవిత. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com