poonam kaur : సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ట్వీట్ చేసిన పూనమ్.. తన తండ్రి గురించి కామెంట్

poonam kaur : సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూనమ్ కౌర్.. ఈసారి పాలిటిక్స్ గురించి ఓ రేర్ పిక్ షేర్ చేసింది. అది కూడా తన తండ్రి గురించి చెప్పుకొచ్చింది. టీడీపీ 40 ఏళ్ల సంబరాలను పురస్కరించుకుని.. నాడు ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించినప్పటి ఫోటోను షేర్ చేసింది. దీంతో అసలీ ఫోటోలో ఏముందా అని నెటిజన్లు సెర్చ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ పక్కన తన తండ్రి కూడా ఉన్నారని ఆ పిక్ గురించి చెప్పేసరికీ అందరూ ఒక్కసారిగా ఆ పిక్ లో ఎవరెవరు ఉన్నారా అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. టీడీపీ వర్గాలు రిలీజ్ చేసిన ఈ పిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతోపాటు పూనమ్ కౌర్ తన తండ్రి గురించి కూడా చెప్పేసరికీ ఇది నెట్టింట బాగా పాపులరైంది.
" it's a day of surprise and happiness for whole family , pictures released by #tdp handles , shows my dad behind #ntr Garu along with other sikh strong supporters "
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 29, 2022
Papa 😍 love u , Johar #ntr Garu pic.twitter.com/uqDf0Xp9Nr
తమ కుటుంబానికి టీడీపీతో ఉన్న అనుబంధం ఈనాటి కాదని, పార్టీ పేరును ప్రకటించే సమయంలో తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ పక్కనే ఉన్నారని పోస్ట్ లో తెలిపింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పిక్ ని షేర్ చేసింది. సీనియర్ ఎన్టీఆర్ కు తన తండ్రి ఓ ఫాలోవర్ గా, మద్ధతుదారుడిగా ఉండేవారంది. ఎన్టీఆర్ పట్ల తనకు అమితమైన గౌరవం ఉందని తెలిపింది. ఈ రోజు తనకు ఆనాటి సంగతులను గుర్తుచేసుకునే ఓ అపురూపమైన ఫోటో కనిపించిందని చెప్పింది. అందుకే లవ్యూ పప్పా.. అంటూ ఆ ఫోటోను తన అకౌంట్ లో పోస్ట్ చేసి ట్వీట్ చేసింది.
మార్చి 29, 1982. ఆ రోజున హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అభిమానుల ఆనందోత్సాహాల నడుమ తెలుగుదేశం పార్టీ పేరును సీనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తో పాటు చాలామంది ప్రముఖులు ఉన్నారు. అందులో పూనమ్ కౌర్ తండ్రితోపాటు .. మరికొందరు సిక్కు మద్దతుదారులు కూడా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com