Actress Rakhi Sawant Ready : మూడో పెళ్లికి సిద్ధమైన నటి రాఖీ సావంత్

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మూడోసారి పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. పాకిస్థాన్ నటుడు, నిర్మాత డోడి ఖాన్‌ను వివాహమాడనున్నట్లు ఆమె సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా జీవితంలో సరైన వ్యక్తి ఇన్నాళ్లకు దొరికాడు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మేం పెళ్లి చేసుకోబోతున్నాం’ అని పోస్ట్ పెట్టారు. కాగా రాఖీ సావంత్ గతంలో రితేష్ సింగ్, ఆదిల్ ఖాన్ దురానీని పెళ్లాడి విడాకులు తీసుకున్నారు.
కాగా, రాఖీ సావంత్.. ఆదిల్ ఖాన్ దురానీని రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాము పెళ్లి చేసుకున్నాం అంటూ 2023 జనవరిలో ప్రకటించారు. అయితే వీరి వివాహబంధం ఎన్నో రోజులు కొనసాగలేదు. ఆరు నెలలైనా తిరక్కముందే వివాహ బంధానికి ముగింపు పలికారు. ఆదిల్ తనను మోసం చేశాడంటూ రాఖీ పోలీసులను ఆశ్రయించింది. తనను హింసిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. తన డబ్బును కూడా యథేచ్ఛగా వాడుకుంటున్నాడని ఆరోపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com