Samantha : చికెన్ గున్యా బారిన నటి సమంత
నటి సమంత సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. వయో సైటిస్ బారిన పడి కోలుకున్న సమంత.. తర్వాత సిటాడెల్ హనీబన్నీవెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ 'సిటడెల్'కు ఇది ఇండియన్ వెర్షన్. ఈ సిరీస్ ను సమంత ఎంతో కష్టపడి పూర్తి చేశారు. దీని తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న సమంత మళ్లీ షూటింగ్లో బిజీ అవుతోంది. తాజాగా చికెన్ గున్యా బారిన పడినట్లు పోస్ట్ పెట్టింది సామ్. తాను ఇప్పుడు కోలుకుంటున్నట్టు చెబుతోంది. ఇందులో భాగంగానే జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నట్టు చెబుతోందీ అమ్మడు. ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడంలోనూ చాలా ఫన్ ఉంది' అంటూ బాధతో కూడిన ఎమోజీలను పోస్ట్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com