Sonia Agarwal : ఆయనతో కలిసి పని చేయడానికి నో ప్రాబ్లమ్ : సోనియా అగర్వాల్‌

Sonia Agarwal : ఆయనతో కలిసి పని చేయడానికి నో ప్రాబ్లమ్  :  సోనియా అగర్వాల్‌

హీరోయిన్ సోనియా అగర్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు సెల్వ రాఘవన్ తో విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన దర్శకత్వంలో నటించడం తనకు ఇష్టమేనని చెప్పారు. ఆయనతో కలిసి పని చేయడానికి తనకెలాంటి సమస్య లేదన్నారు. తాజాగా సోనియా అగర్వాల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుదుపేట్టై– 2 చిత్రంలో నటించడం తనకు ఇష్టమేనని... అయితే ఆ చిత్రంలో నటించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. అసలు ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియదని నటి సోనియా అగర్వాల్‌ పేర్కొన్నారు.

ధనుష్‌ సరసన కాదల్‌ కొండేన్‌, పుదుపేటఐఅట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన్‌ కాలనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది సోనియా అగర్వాల్‌. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు సెల్వరాఘవనే. ఆ టైమ్ లోనే సోనియా, సెల్వరాఘవన్ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత 2006 లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి దాంపత్య బంధం ఎక్కువ కాలం సాగలేదు. విభేదాలు కారణంగా 2009 లో విడిపోయారు.

7G బృందావన్ కాలనీ సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కగా.. రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. 2004లో రిలీజైన ఈ చిత్రానికి.... యువన్ శంకర్ రాజా సంగీతాన్నందించారు. ఈ సినిమాలోని పాటలు ఎవర్‌గ్రీన్‍గా నిలిచిపోయాయి. అతడి కూడా ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.

ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల రీ రిలీజ్‌ ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమంలో నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో ఈ సీక్వెల్‌ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి కూడా సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించినున్నట్లు చెప్పారు. స్క్రిప్ట్‌ కూడా సిద్ధమైందని.. తప్పకుండా మరోసారి అందరూ కనెక్ట్‌ అవుతారని ఆయన చెప్పారు.

Tags

Next Story