'ఆదిపురుష్' ఐమాక్స్‌లో విడుదల కాదట.. ఎందుకంటే..

ఆదిపురుష్ ఐమాక్స్‌లో విడుదల కాదట.. ఎందుకంటే..
X
ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ విడుదలకు ముందే ఎన్నో వివాదాలు.. గ్రాఫిక్స్ బాగాలేదని, చిన్న పిల్లల యానిమేటెడ్ చిత్రాల మాదిరిగా ఉందని, పాత్రలు, పాత్ర ధారుల ఆహార్యం సరిగా లేదని, ఒకటి కాదు చాలా తప్పులు పడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసారు.

ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ విడుదలకు ముందే ఎన్నో వివాదాలు.. గ్రాఫిక్స్ బాగాలేదని, చిన్న పిల్లల యానిమేటెడ్ చిత్రాల మాదిరిగా ఉందని, పాత్రలు, పాత్ర ధారుల ఆహార్యం సరిగా లేదని, ఒకటి కాదు చాలా తప్పులు పడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసారు. అయినా తమ పని తాము చేసుకుంటూ విడుదలకు సిద్ధమైంది ఆదిపురుష్ టీమ్.. సినిమా చూసిన తరువాత మీరు చేసిన వ్యాఖ్యలు తప్పు అని భావిస్తారని నమ్మకంగా చెబుతున్నారు ఓం రౌత్ టీమ్.

ఇంకేం విడుదల డేట్ రానే వచ్చింది.. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న థియేటర్లలో ఆదిపురుష్ విడుదల కానుంది. వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ ఎంత వరకు తమ పాత్రలకు న్యాయం చేశారో చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి.

అయితే ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు నుంచి ఐమ్యాక్స్ విడుదల కాదని కొన్ని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇది ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించింది. వారిలో కొందరు విడుదలను సరిగ్గా ప్లాన్ చేయలేదని ప్రొడక్షన్ హౌస్ ని, టి-సిరీస్‌ను తప్పు పడుతున్నారు. ఆదిపురుష్‌పై ట్వీట్‌లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9న తిరుపతిలో జరిగింది. ప్రభాస్ ఆదిపురుష్ కి ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్ నుండి 'U' సర్టిఫికేట్ వచ్చింది.

DC యొక్క సూపర్ హీరో చిత్రం ది ఫ్లాష్, అదే తేదీన విడుదలవుతోంది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ భారతదేశంలో IMAX స్క్రీన్‌లను చాలా ముందుగానే బ్లాక్ చేసింది. అందువల్ల భారతదేశంలోని IMAX థియేటర్లలో ఆదిపురుష్‌ను ప్రదర్శించడానికి అవకాశం లేదు. అయితే ఇలాంటి భారీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాని ఐమాక్స్ లాంటి థియేటర్లలో చూస్తేనే అభిమానులకు సంతృప్తి. నిజానికి నిర్మాతలకూ ఇది పెద్ద దెబ్బే.

అయితే దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఆదిపురుష ఐమాక్స్ విడుదలలో ఏమైనా మార్పులు జరగాలని ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఓం రౌత్ రచన, దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. ఆదిపురుష్ ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.

Tags

Next Story