Adipurush: 'ఆదిపురుష్'.. అయోధ్యలో 'టీజర్' లాంచ్.. అందరూ ఆహ్వానితులే..

Adipurush: ఆదిపురుష్.. అయోధ్యలో టీజర్ లాంచ్.. అందరూ ఆహ్వానితులే..
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది.

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, ఆయనకు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ నటి కృతిసనన్ నటిస్తోంది.

లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖీన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ లో ప్రభాస్ రాముడిగా నింగికి విల్లు ఎక్కుపెట్టి పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది.

అయితే అక్టోబర్ 2 రాత్రి 7.11 గంటలకు అయోధ్యలోని సరయు నది ఒడ్డున టీజర్ విడుదల చేయడానికి యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ.. ఈ వేడుకలో అందరూ భాగస్వామ్యం కావచ్చు అని దర్శకుడు ఓంరౌత్ పేర్కొన్నారు.




Tags

Read MoreRead Less
Next Story