Adipurush Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఆదిపురుష్' రిలీజ్ డేట్ వచ్చేసింది..

Adipurush Release Date: ప్రభాస్ రాముడిగా.. అది కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న చిత్రం అనగానే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. 'బాహుబలి', 'సాహో'లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. అంతే కాకుండా తన సినిమాలతో బాలీవుడ్ హీరోలతో పోటీపడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ దర్శకుడితో సినిమాను చేస్తున్నాడు.
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఎక్కువగా గ్రాఫిక్స్‌పై దృష్టిపెట్టే చిత్రం కావడంతో ఆదిపురుష్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంతలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌ను హ్యపీ చేసే న్యూస్ వచ్చేసింది.
ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన 'రాధే శ్యామ్' మార్చి 11న విడుదలకు సిద్ధమయ్యింది. ఇక తాజాగా ఆదిపురుష్ విడుదల తేదీని కూడా వెల్లడించి ప్రభాస్ ఫ్యాన్స్‌ను డబుల్ హ్యాపీ చేశారు. 2023 జనవరి 12న ఆదిపురుష్ విడుదల కానున్నట్టు శివరాత్రి సందర్భంగా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్.. ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌లతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ అందనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com