Aditi Rao : పెళ్లి గురించి అదితిరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్, బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైదరీ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న వీరు.. లాస్ట్ ఇయర్ వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. తాజాగా కొందరు అతిథుల సమక్షంలో అదే ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా తన పెళ్లి గురించి అదితిరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'మాపెళ్లికి పెద్దగా ప్లాన్ చేయలేదు. మ్యారేజ్ జరిగిన ఆలయం మా పూర్వీకులు కట్టించారు. దాదాపు 400 ఏళ్లుగా ఆలయం మా కుటుంబంలో భాగంగా ఉంది.మా ఫ్యామిలీలో ఆ టెంపుల్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే నాన్న, నానమ్మకు ఈ గుడి చాలా ఇష్టం. అందుకే మా పెళ్లి అక్కడ చేసుకోవడం వారికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. వారి అశీస్సులు కూడా అందాయి' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ సెన్సేషన్ అవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com