Aditya 369 Re-Release : ఆదిత్య 369 .. టైమ్ ట్రావెల్ మళ్లీ పిలుస్తోంది

భారత సినీ చరిత్రలో మొదటి టైమ్ ట్రావెల్ చిత్రం 'ఆదిత్య 369'. నటసింహం నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 సింగీతం శ్రీనివాస తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రాత్రి 1991లో విడుదలై తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య నటన ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా శ్రీ కృష్ణదేవరాయ పాత్రలో ఆయన్ను తప్ప మరెవరినీ ఊహించ లేము అనేంతలా ఆ పాత్రకు ప్రాణం పోశారు. వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈచిత్రం.. మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా శ్రీ దేవి మూవీ టీం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాని 4కేలో రీరిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సమ్మర్లోనే మళ్లీ థియే టర్లలో అలరించనుంది. కాగా, 'ఆదిత్య 369'కు సీక్వెల్ తీయనున్నట్లు ఇప్పటికే బాలయ్య ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com