Dacoit : అంచనాలు పెంచేసిన అడివి శేష్ డెకాయిట్ గ్లింప్స్

Dacoit : అంచనాలు పెంచేసిన అడివి శేష్ డెకాయిట్ గ్లింప్స్
X

అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా డెకాయిట్. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. హిందీ, తెలుగు భాషలలో ఏక కాలంలో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ ఆడియన్స్ కు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో అడివి శేష్ ఇంటెన్స్ లుక్ లో దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట్ ని చూస్తూ కనిపించినట్టుగానే ఈ ఫైర్ గ్లింప్స్ లో రివీల్ చేశారు. చాలా ఇంట్రస్టింగ్ గా ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు మాజీ ప్రేమికుల కథే 'డెకాయిట్'. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. మాత్రం పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో మేక‌ర్స్ ఉన్నారు. ఆ మ‌ధ్య శృతి హాస‌న్ ఇందులో న‌టిస్తుంద‌ని పోస్టర్ ద్వారా తెలిపారు. కాని త‌ర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని తెలిసింది. డేట్స్ ఇష్యూతో పాటు అడివి శేష్‌ కూడా కారణం అని తెలుస్తోంది.

Tags

Next Story