Srileela : మరో పాపను దత్తత.. మా ఇంటికి మరో చిట్టితల్లి

హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజి బిజీగా ఉంటోంది. జయపజయాలతో సంబంధం లేకుండా ఇటు టాలీవుడ్ లో, అటు హిందీలోనూ వరుసగా మూవీలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో మాస్ జాతర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ అందాల తార. దీంతో పాటు పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సిని మాలోనూ శ్రీలీలనే కథానాయిక. వీటితో పాటు హిందీలో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఓ సినిమా చేస్తోందీ ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. వయసులో చిన్నదైనా శ్రీలీల మనసు చాలా గొప్పది. ఇప్పటికే గురు, శోభిత అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూసుకుంటోంది. తాజాగా ఈభామ మరో పాపను దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందనే అర్థంలో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఓ చిన్నారికి ముద్దు పెడుతున్న ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఈ పాప ఎవరు? శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుదందా? లేక తన బంధువుల పాపనా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com