Kollywood : 20 ఏళ్ల తరువాత.. సూర్యకు జోడీగా త్రిష

Kollywood : 20 ఏళ్ల తరువాత.. సూర్యకు జోడీగా త్రిష
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఆర్ జే బాలజీ డైరెక్షన్ లో ఓ భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కబోతోంది. సూర్య కెరీర్ లో 45వ సినిమాగా రానున్న ఈమూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కాగా ఈమూవీకి హీరోయిన్ గా ఓ సీనియర్ స్టార్ ని తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే వరుస ఆఫర్లతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన త్రిష ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపికయ్యారట. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరి జంట మళ్లీ తెరపై

కనిపించనుంది. గతంలో మౌనం పెసియాధే, యువ, ఆరు మూవీస్ లో నటించారు. చాలాకాలం తర్వాత వచ్చిన ఈ ఆఫర్ ను త్రిష కూడా ఓకే చెప్పారట. ఈ మేరకు ప్రాజెక్ట్ పై సైన్ కూడా చేశారట. ఇక మూవీలో త్రిష షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. వేరే మూవీ షెడ్యూల్ ఉండటంతో ఆమె బిజీగా ఉన్నారు.కాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది.

Tags

Next Story