Allu Arjun with Prabhas : ప్రభాస్ తర్వాత అల్లు అర్జునే టాప్

Allu Arjun with Prabhas :   ప్రభాస్ తర్వాత అల్లు అర్జునే టాప్
X

సినిమాలకు సంబంధించి టాప్ 2 ప్లేసెస్ లో జాతీయ స్థాయిలో తెలుగువాళ్లదే హవా. ప్యాన్ ఇండియా హీరోగా ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. దర్శకులు కూడా మనవాళ్లే. రాజమౌళి, సుకుమార్ లే ఉన్నారు. అంటే రాజమౌళి మూవీస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టి దాన్ని నిలబెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ ప్రభాస్ ను కొట్టే హీరో వేరే ఏ భాషలోనూ రాలేదు. బట్ అతని తర్వాతి స్థానంలోకి మళ్లీ మన తెలుగు స్టార్ అల్లు అర్జునే వచ్చాడు. ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయి అనేది పక్కన బెడితే పుష్ప తో ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు బన్నీ. ఈ మూవీతోనే బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. విశేషం ఏంటంటే.. పుష్ప సౌత్ లో కంటే నార్త్ లోనే భారీ వసూళ్లు సాధించింది. ఈ వసూళ్లే ఐకన్ స్టార్ ను ఆలిండియా రేంజ్ లో రిలీజ్ కు ముందే రికార్డులు కొట్టేలా చేసింది.

పుష్ప 2 బిజినెస్ చూసి అన్ని భాషల హీరోలూ నోరెళ్లబెడుతున్నారు. అది కూడా నాన్ థియేట్రికల్ లోనే కావడం విశేషం. ఈ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ ప్రభాస్ కు కూడా కాలేదు అంటే అతిశయోక్తి కాదు. పుష్ప 2 ఓటిటి, ఆడియో రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారానే ఏకంగా 1000 కోట్ల బిజినెస్ చేసింది. ఇంకా థియేట్రికల్, ఓవర్శీస్ రైట్స్ ఉన్నాయి. ఈ రెండూ కలిపి మరో 6 -7 వందల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే రిలీజ్ కు ముందే భారీగా టేబిల్ ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి. ఈ మార్క్ ను బన్నీ క్రాస్ చేస్తే ప్రభాస్ తర్వాతి స్థానం అతనిదే అవుతుంది. తెలుగు నుంచి ఇద్దరు టాప్ హీరోలు నేషనల్ వైడ్ గా రూలింగ్ చేయడం మొదలవుతుంది. అలాగే ఇదే మూవీతో సుకుమార్ సైతం రాజమౌళి తర్వాతి స్థానానికి చేరతాడు. కొన్నేళ్ల క్రితం రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పోటీకి వస్తే తను ఎక్కువగా భయపడే దర్శకుడు సుకుమార్ అని చెప్పాడు. అదే నిజం కాబోతోంది. కాకపోతే ఇప్పుడప్పుడే రాజమౌళిని బీట్ చేయడం సాధ్యం కాదు. బట్ సుకుమార్ కు ఆ సత్తా ఉందంటే కాదనలేం. కాకపోతే ఎటొచ్చీ పుష్ప 2 జాతీయ స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి.

Tags

Next Story