Oscars Museum : ఆస్కార్ మ్యూజియంలో ఐశ్వర్య లెహంగా!

Oscars Museum : ఆస్కార్ మ్యూజియంలో ఐశ్వర్య లెహంగా!
X

జోధా అక్బర్ సినిమాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ధరించిన లెహంగాకు ప్రతిష్టాత్మక మైన ఆస్కార్ మ్యూజియంలో ఇది చోటు దక్కించుకుంది. ఈవిషయాన్ని తెలుపుతూ అకాడమీ తన అధికారిక ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. జోధా అక్బర్ సినిమాలో రాణికి ఈ లెహెంగా మరింత అందాన్ని తెచ్చింది. వెండితెరపై ఎంతోమందిని ఆకర్షించిన దీన్ని ఆస్కార్ మ్యూజియంలో ప్రదర్శించనున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోతుందని అకాడమీ పోస్టలో పేర్కొంది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అకాడమీ మ్యూజియంలో కనిపించనున్న మొదటి ఇండియన్ డ్రెస్ ఇదే కావడం విశేషం. దీంతో ఈ లెహెంగాను రూపొందించిన నీతా లుల్లా పనితీరును పలువురు ప్రశంసిస్తున్నా రు. 2008లో విడుదలైన ‘జోధా అక్బర్' సినిమాలో అక్బర్గా హృతిక్ రోషన్, జోధా రాణిగా ఐశ్వర్యరాయ్ కనిపించారు. ఈ చిత్రంలోని నటీనటులు ధరించిన దుస్తులు అప్పట్లో అందరినీ ఆకర్షించాయి. ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story